S. P. Balasubrahmanyam - Aruna Raagam текст песни

Текст песни Aruna Raagam - S. P. Balasubrahmanyam

అరుణ కాంతుల నింపుచూ నింగి నిద్దుర లేచెను
లతలు పువ్వుల కన్నులా తెరచి సాయిని చూసెను
పక్షులా కలరవం సుప్రభాతము పలికెను
షిరిడియే ఒక్కటై భక్తి గీతము పాడెను
అల్ల నల్లన చల్ల గాలులు వీచే చామరమై
మేఘమాయెను సాయి బాబాకు శ్వేత చత్రంమ్మై
భక్త లోకపు భజనలాయెను వేదం మంత్రములు
తాళ వాద్యములాయే ప్రభువునికి దేవ దుందుభులు
పువ్వుల గంధమే దూపమాయెను ప్రభునికి
అరుణ కాంతుల నింపుచూ నింగి నిద్దుర లేచెను
లతలు పువ్వుల కన్నులా తెరచి సాయిని చూసెను
పక్షులా కలరవం సుప్రభాతము పలికెను
షిరిడియే ఒక్కటై భక్తి గీతము పాడెను
సాయినాథుని ధ్యానమందున మునిగే దశదిశలు
సాయిబాబా మహిమ పాడెను జనుల ఊపిరులూ
బాల సూర్యుని కిరణజాలమే కాగడారతులు
ఫల నివేదనమాయే ప్రభునికి భక్త హృదయములు
భక్తులా కన్నులే లక్ష దీపపు వరుసలు
అరుణ కాంతుల నింపుచూ నింగి నిద్దుర లేచెను
లతలు పువ్వుల కన్నులా తెరచి సాయిని చూసెను
పక్షులా కలరవం సుప్రభాతము పలికెను
షిరిడియే ఒక్కటై భక్తి గీతము పాడెను

Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}