S. P. Balasubrahmanyam - Shri Sainathuni Kanti текст песни

Текст песни Shri Sainathuni Kanti - S. P. Balasubrahmanyam

శ్రీ సాయినాథుని కంటి, షిరిడిపుర వాసుని కంటి
పాహిమాం అంటిని శ్రీ కరుణామయుని కావుమా అంటిని

కోరక మునుపే శుభములు గొలిపే దాతను చూసానయా
స్వామిని చూసానయా...
కలియుగ వరదుని ప్రార్థన చేసానయా
శ్రీ సాయినాథుని కంటి, షిరిడిపుర వాసుని కంటి, పాహిమాం అంటిని
కపని తొడిగిన మణిమయ ముకుటుని, చందన గంధ విరాజితుని
నగవుల మమతల సుధలను చిలికెడి ఆశ్రిత బాంధవ గురుని
భవుమును బాపెడి పరమును చూపెడి బాబానే కంటిని
శ్రీ దివ్య సాయి బాబా కంటిని
శ్రీ సాయినాథుని కంటి, షిరిడిపుర వాసుని కంటి
పాహిమాం అంటిని శ్రీ కరుణామయుని కావుమా అంటిని
తాళ మేళము చేర్చి భక్తి భావము కూర్చి
దాస జనులు కొనియాడగను
దారిని మడుగులు పరచి చామరమును వీచి
స్వామి పల్లకి ముందు సాగగను
దైవ స్వరూపుడైన దివ్య కాంతుల తేజో మూర్తిని కంటిని
షిరిడిపురము నందు సాయిని కంటిని
శ్రీ సాయినాథుని కంటి, షిరిడిపుర వాసుని కంటి
పాహిమాం అంటిని శ్రీ కరుణామయుని కావుమా అంటిని
శ్రీ సాయినాథుని కంటి, షిరిడిపుర వాసుని కంటి
పాహిమాం అంటిని శ్రీ కరుణామయుని కావుమా అంటిని
కోరక మునుపే శుభములు గొలిపే దాతను చూసానయా
స్వామిని చూసానయా...
కలియుగ వరదుని ప్రార్థన చేసానయా
శ్రీ సాయినాథుని కంటి, షిరిడిపుర వాసుని కంటి
పాహిమాం అంటిని శ్రీ కరుణామయుని కావుమా అంటిని

Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}