S. P. Balasubrahmanyam - Charana Kinkinulu текст песни

Текст песни Charana Kinkinulu - S. P. Balasubrahmanyam



చరణకింకిణులు ఘల్లు ఘల్లుమన.
కరకంకణములు గల గలలాడగా.
హ.హ.హ.
అడుగులందు కలహంసలాడగా.
నడుములో తరంగమ్ములూగగా.
వినీల గజభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా...
ఆడవే మయూరీ...
నటనమాడవే మయూరీ.
నీ కులుకును గని నా పలుకు విరియ.
నీ నటనను గని నవకవిత వెలయగా.
ఆడవే మయూరీ...
నటనమాడవే మయూరీ...
ఆడవే మయూరీ.
అది యమునా సుందర తీరమూ...
అది రమణీయ బృందావనమూ.
అది విరిసిన పున్నమి వెన్నెలా...
అది వీచిన తెమ్మెర ఊయలా.
అది చల్లని సైకత వేదికా ఆట సాగెను విరహిణి రాధికా.
అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతికా.
ఆడవే మయూరీ.
నటనమాడవే మయూరీ.
నా పలుకులకెనయగు కులుకు చూపి.
నా కవితకు సరి యగు నటన చూపి.
ఇక ఆడవే మయూరీ...
నటనమాడవే మయూరీ.
పాలనేత్ర సంప్రదవజ్వాలలు ప్రసవశరుని దహియించగా.
పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా.
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమధ గణము కనిపించగా.
ప్రమధనాధ కర పంకజ భాంకృత ఢమరు ధ్వని వినిపించగా.
ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భుటుల చలిత దిక్కుటుల
జటిత దిక్కురుల వికృత ఘీంకృతుల సహస్ర ఫణ సంచలిత భూకృతుల.
కనులలోన కనుబొమలలోన...
అధరమ్ములోన వదనమ్ములోన.
కనులలోన కనుబొమలలోన...
అధరమ్ములోన వదనమ్ములోన.
గళసీమలోన కటిసీమలోనా.
కరయుగములోన పదయుగములోన...
నీ తనువులోని అణువణువులోన .
అనంత విధముల అభినయించి.
ఇక ఆడవే... ఆడవే. ఆడవే...



Авторы: K V MAHADEVAN, K. V. MAHADEVAN, REDDY DR C NARAYANA, DR. C NARAYANA REDDY


S. P. Balasubrahmanyam - Chelleli Kaapuram (Original Motion Picture Soundtrack)
Альбом Chelleli Kaapuram (Original Motion Picture Soundtrack)
дата релиза
01-12-1971




Внимание! Не стесняйтесь оставлять отзывы.