S. P. Balasubrahmanyam - Lali Jo Lali Jo (From "Indhrudu Chandhrudu") текст песни

Текст песни Lali Jo Lali Jo (From "Indhrudu Chandhrudu") - S. P. Balasubrahmanyam




మ్మ్... హు... మ్మ్.మ్మ్.హు.మ్మ్...
మ్మ్... హు... మ్మ్.మ్మ్.హు.మ్మ్...
లాలిజో లాలిజో ఊరుకో పాపాయి...
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి...
తెలుసా ఈ ఊసు చెబుతా తల ఉంచుఊచు
కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
ఆలినే కాదంది కాకినే కూడింది...
అంతలో ఏమైంది అడగవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
మ్మ్... హు... మ్మ్.మ్మ్.హు.మ్మ్...
మ్మ్... హు... మ్మ్.మ్మ్.హు.మ్మ్...
మాయనే నమ్మింది బోయతో పోయింది
దెయ్యమే పూనిందో రాయిలా మారింది
వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే
తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది
కన్నులే విప్పింది గండమే తప్పింది
ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
మ్మ్... హు... మ్మ్.మ్మ్.హు.మ్మ్...
మ్మ్... హు... మ్మ్.మ్మ్.హు.మ్మ్...
పిల్లలు ఇల్లాలు ఎంతగా ఏడ్చారు
గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోశారు
నేరం నాదైనా భారం మీ పైన
తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
తల్లిలా మన్నించు మెల్లగా దండించు
కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
బుద్దిలో లోపాలే దిద్దుకోనీవమ్మా
మ్మ్... హు... మ్మ్.మ్మ్.హు.మ్మ్...
మ్మ్... హు... మ్మ్.మ్మ్.హు.మ్మ్...
లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
మ్మ్... హు... మ్మ్.మ్మ్.హు.మ్మ్...
మ్మ్... హు... మ్మ్.మ్మ్.హు.మ్మ్...
చిత్రం: ఇంద్రుడు-చంద్రుడు (1989)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు



Авторы: ILAYARAJA, SIRIVENNELA SITARAMA SASTRY


Внимание! Не стесняйтесь оставлять отзывы.