S. P. Balasubrahmanyam - Punya Bhoomi Naa Desham текст песни

Текст песни Punya Bhoomi Naa Desham - S. P. Balasubrahmanyam



పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయదేశం నా దేశం
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
అదిగో ఛత్రపతీ ధ్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు జడిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట కలుపుతుంటే ఆఆఆ.
క్షుద్ర రాజకీయానికి రుద్రనేత్రుడై లేచి
మాతృ భూమి నుదిటిపై నెత్తురు తిలకం దిద్దిన మహా వీరుడు సార్వభౌముడు
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన
ఒరెయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు
నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా
ఒరెయ్ తెల్ల కుక్క కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి
రా
అని పెల పెల సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గు పాలు తాగాడు
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ
అదిగదిగో అదిగదిగో ఆకాశం భళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి
అగ్గి పిడుగు అల్లూరి
ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడాపొగరు బట్టిన తెల్ల దొర గాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొ చ్చిన దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే
చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను కడతది చూడరా
అన్న మన్నెం దొర అల్లూరిని చుట్టు ముట్టి మంది మార్బలమెట్టి మర ఫిరంగులెక్కు పెట్టి
వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే
వందే మాతరం (వందే మాతరం)
వందే మాతరం (వందే మాతరం)
వందే మాతరం అన్నది ఆకాశం
ఆజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి
అఖండ భరత జాతి కన్న మరో శివాజి
సాయుధ సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర భారతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పన చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని గడిపాడు
గగన సిగలకెగసి కనుమరుగై పోయాడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్
జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్
గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం
సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే ధ్రువతారల కన్నది దేశం
చరితార్దులకన్నది నా భారత దేశం నా దేశం
పుణ్యభూమి నా దేశం నమో నమామీ
ధన్య భూమి నా దేశం సదా స్మరామీ
నన్ను కన్న నా దేశం నమో నమామీ
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామీ



Авторы: jaaladi


S. P. Balasubrahmanyam - Major Chandrakanth (Original Motion Picture Soundtrack)
Альбом Major Chandrakanth (Original Motion Picture Soundtrack)
дата релиза
10-01-1993




Внимание! Не стесняйтесь оставлять отзывы.