S. P. Balasubrahmanyam - Yaviriki Thelusu (From "Malle Puvvu") текст песни

Текст песни Yaviriki Thelusu (From "Malle Puvvu") - S. P. Balasubrahmanyam

మల్లెల మంటల రేగిన గ్రీష్మం నా గీతం...
పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ ఆనందం...
వెన్నెల తో చితి రగిలించిన కన్నులు నా సంగీతం...
ఆపేసావెం బాబు.బాగుంది.ఆలపించు...
ఎవరికి తెలుసు. చితికిన మనసు చితిగా రగులుననీ
ఎవరికి తెలుసూ...
ఎవరికి తెలుసు. చితికిన మనసు చితిగా రగులుననీ
చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ...
మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ
మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ
చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ
జగతికి హృదయం లేదని
జగతికి హృదయం లేదని
నా జన్మకు ఉదయం లేనే లేదనీ
ఆ.
ఎవరికి తెలుసూ...
ఎవరికి తెలుసు. చితికిన మనసు చితిగా రగులుననీ
చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ...
గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం
గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం
నిప్పులు చెరిగే నా గీతంలో . నిట్టూరుపులే సంగీతం
నిప్పులు చెరిగే నా గీతంలో . నిట్టూరుపులే సంగీతం
ప్రేమకు మరణం లేదని
నా ప్రేమకు మరణం లేదని
నా తోటకు మల్లిక లేనే లేదనీ
ఆ.
ఎవరికి తెలుసూ...
ఎవరికి తెలుసు. చితికిన మనసు చితిగా రగులుననీ
చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ... మ్మ్.మ్మ్.మ్మ్
చిత్రం: మల్లెపువ్వు (1978)
సంగీతం: చక్రవర్తి
రచన: వేటూరి
గానం: ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం

Авторы: VETURI SUNDARA RAMAMURTHY, M. S. VISWANATHAN

Внимание! Не стесняйтесь оставлять отзывы.