S. P. Balasubrahmanyam - Yekkadunnavamma текст песни

Текст песни Yekkadunnavamma - S. P. Balasubrahmanyam



ఎక్కడున్నావమ్మా ప్రియతమా...
ఏది అనుకోనమ్మా నీ చిరునామా
దేశం కాని దేశంలో సాగరంలాంటి నగరంలో
ఎప్పుడు ఎదురొస్తావో...
నా యదపై ఎప్పుడు నిదురిస్తావో...
సుబ్బలక్ష్మి నెల్లూరు సుబ్బలక్ష్మి పిచ్చుక
సుబ్బలక్ష్మి సుంకర సుబ్బలక్ష్మి కుచిపుడి సుబ్బలక్ష్మి గురజాడ
సుబ్బలక్ష్మి చెరుకూరి సుబ్బలక్ష్మి దగ్గుబాటి
సుబ్బలక్ష్మి పోసాని సుబ్బలక్ష్మి బెల్లంకొండ
సుబ్బలక్ష్మి సానా సుబ్బలక్ష్మి కోడూరి
ఎక్కడున్నావమ్మా ప్రియతమా.
ఏది అనుకోనమ్మా నీ చిరునామా
లాలలలా... లాలలలా... లాలలలా.లాలలలా
అసలు పేరు ఒకటే తెలుసు కొసరు పేరు ఏమిటో
మేని ఛాయ ఒకటే తెలుసు ఉన్న చోటు ఏమిటో
రూపు రేఖలొకటే తెలుసు ఊరువాడ ఏమిటో
మాట మధురిమొకటే తెలుసు ఫోను నంబరేమిటో
అక్కడి చిలకను అడిగితే నువు
సప్త సముద్రాలవతల ఉంటున్నావని చెప్పిందే
మరి ఇక్కడికొచ్చి వాలితే ఇంగ్లీష్ చిలక నీ ఆచూకి తెలుపగ లేకుందే
ఎవరిని అడగాలి ఎలా నిను చేరాలి
సుబ్బలక్ష్మి మాగుంట సుబ్బలక్ష్మి దాసరి
సుబ్బలక్ష్మి వాసిరెడ్డి సుబ్బలక్ష్మి మేడికొండ
సుబ్బలక్ష్మి గోరంట్ల సుబ్బలక్ష్మి వెల్లంకి
సుబ్బలక్ష్మి పగడాల సుబ్బలక్ష్మి కొమ్మూరి
సుబ్బలక్ష్మి మణుగూరి సుబ్బలక్ష్మి కోన
సుబ్బలక్ష్మి నండూరి
ఎక్కడున్నావమ్మా ప్రియతమా
ఏది అనుకోనమ్మా నీ చిరునామా
హ.హ... .హ.హ... హ... హ.హ...
ఫస్టుటైము డైలు చేయగా అష్టలక్ష్మి పలికెరా
రెండోసారి రింగు చేయగా రాజ్యలక్ష్మి దొరికెరా
హోయ్. మరోమారు ట్రైలు వేయగా మహాలక్ష్మి నవ్వెరా
సుబ్బలక్ష్మి మాట ఎత్తగా సుబ్బాయమ్మ తిట్టెరా
ఎదురుదెబ్బలే తగిలినా నే పట్టు వదలని
విక్రమార్కుడికి మాస్టరునవుతాన్లే
కరి మబ్బులెన్ని నను కమ్మినా
నా నెచ్చెలి నింగికి నిచ్చెన వేసి చేరువవుతాలే
నమ్మకముందమ్మా నిను కలుపును నా ప్రేమా
సుబ్బలక్ష్మి భోగవల్లి సుబ్బలక్ష్మి అక్కినేని
సుబ్బలక్ష్మి నెక్కంటి సుబ్బలక్ష్మి ఆకుల
సుబ్బలక్ష్మి గోగినేని సుబ్బలక్ష్మి మిద్దె
సుబ్బలక్ష్మి బొమ్మకంటి సుబ్బలక్ష్మి తనికెళ్ళ
సుబ్బలక్ష్మి బోయిన సుబ్బలక్ష్మి కట్టా
సుబ్బలక్ష్మి కైకాలా...
ఎక్కడున్నావమ్మా ప్రియతమా
ఏది అనుకోనమ్మా నీ చిరునామా
హే.హే.హే... హే.హే.హే... హే.హే.హేహే.హే.హే
హే.హే.హే... హే.హే.హే... హే.హే.హేహే.హే.హే



Авторы: M.M. KEERAVANI, CHANDRABOSE


S. P. Balasubrahmanyam - Okariki Okaru
Альбом Okariki Okaru
дата релиза
07-06-2003




Внимание! Не стесняйтесь оставлять отзывы.