Shreya Ghoshal - Nuvve Na Shwasa текст песни

Текст песни Nuvve Na Shwasa - Shreya Ghoshal




నువ్వే నా శ్వాస
మనసున నీకై అభిలాష
బ్రతుకైన నీతోనే
చితికైన నీతోనే
వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ
ప్రియతమా... ప్రియతమా!
నువ్వే నా శ్వాస
మనసున నీకై అభిలాష
పూవుల్లో పరిమళాన్ని పరిచయమే చేశావు
తారల్లో మెరుపులన్నీ దోసిలిలో నింపావు
మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు
నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా
నీ జ్ఞాపకాలన్నీ జన్మలోనైనా నే మరువలేనని నీతో చెప్పాలని చిన్ని ఆశ
ప్రియతమా... ప్రియతమా!
నువ్వే నా శ్వాస
మనసున నీకై అభిలాష
సూర్యుణితో పంపుతున్నా అనురాగపు కిరణాన్ని
గాలులతో పంపుతున్నా ఆరాధన రాగాన్ని
ఏరులతో పంపుతున్నా ఆరాటపు ప్రవాహాన్ని
దారులతో పంపిస్తున్నా అలుపెరుగని హృదయ లయలని
చోట నువ్వున్నా నీ కొరకు చూస్తున్నా
నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ
ప్రియతమా... ప్రియతమా!



Авторы: CHANDRABOSE, M.M. KEERAVANI



Внимание! Не стесняйтесь оставлять отзывы.
//}