Shreya Ghoshal - Thalachi Thalachi (Female Version) [From "7G Brundhavana Colony"] текст песни

Текст песни Thalachi Thalachi (Female Version) [From "7G Brundhavana Colony"] - Shreya Ghoshal




తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని, నీలో నన్ను చూసుకొంటిని
తెరచి చూసి చదువు వేళ కాలిపోయే లేఖ రాశా
నీకై నేను బ్రతికి ఉంటిని, నీలో నన్ను చూసుకొంటిని
కొలువు తీరు తరువుల నీడ
చెప్పుకొనును మన కథనెపుడు
రాలిపోయిన పూల గంధమా
రాక తెలుపు మువ్వల సడిని
తలచుకొనును దారులు ఎపుడూ
పగిలిపోయిన గాజుల అందమా
అరచేత వేడిని రేపే చెలియ చేయి నీ చేత
ఒడిలో వాలి కథలను చెప్ప రాసిపెట్టలేదు
తొలి స్వప్నం చాలులే ప్రియతమా కనులు తెరువుమా
మధురమైన మాటలు ఎన్నో
కలసిపోవు నీ పలుకులలో
జగము కరుగు రూపే కరుగునా
చెరిగిపోని చూపులు అన్నీ
రేయి పగలు నిలుచును నీలో
నీదు చూపు నన్ను మరచునా
వెంట వచ్చు నీడబింబం వచ్చి వచ్చి పోవు
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా తిరిగి నేను వస్తా
ఒక సారి కాదురా ప్రియతమా ఎపుడు పిలిచినా
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా
నీకై నేను బ్రతికి ఉంటిని, నీలో నన్ను చూసుకొంటిని



Авторы: YUVAN SHANKAR RAJA, SHIVA GANESH



Внимание! Не стесняйтесь оставлять отзывы.