Unni Menon - Vaalu Kanuladaanaa текст песни

Текст песни Vaalu Kanuladaanaa - Unni Menon

వాలు కనుల దానా...
వాలు కనుల దానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకొన
నీ రూపు చూసి శిలను ఐతినే... ఓక మాట రాక మూగబోతినే
ఓక మాట రాక మూగబోతినే
వాలు కనుల దానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకొనా
నీ రూపు చూసి శిలను ఐతినే... ఓక మాట రాక
ఓక మాట రాక మూగబోతినే
ఓక మాట రాక మూగబోతినే
చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి
రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది
నీ ధ్యాసే అయ్యింది తలపు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది
క్షణ క్షణం నీ తలపుతో తనువు చిక్కిపోయేలే
ప్రాణమిచే ప్రణయమ నీకు సాటియేది ప్రియతమా.
నీ కీర్తినే లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలక
అజంతా సిగ్గులు ఒలకా... చిలకా...
నీ కీర్తినే లోకాలు పలకా ఎల్లోరా శిల్పాలు ఉలక
అజంతా సిగ్గులు ఒలికె రోజే నిను నెను చేరుకొనా
వాలు కనుల దానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకొనా
నీ రూపు చూసి శిలను ఐతినే... ఓక మాట రాక
ఓక మాట రాక మూగబోతినే
దైవం నిన్నే మలచి తనలో తానే మురిసి
ఒంపు సొంపు తీర్చు నేర్పు నీ సొంతం అయ్యింది నా కంట నిలిచింది
ఘడియ ఘడియ ఒడిని కరుగు రస వీణ నీ మేను మీటాలి నా మేను
వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
తనువు మాత్రమిక్కడున్నది నిన్ను ప్రాణమివ్వమన్నది
జక్కన్నా కాలం నాటి చెక్కినా శిల్పం ఒకటి కన్నేగా వచ్చిందంటా చెలియా
జక్కన్నా కాలం నాటి చెక్కినా శిల్పం ఒకటి కన్నేగా వచ్చిందంటా చెలియా
నీ సొగసుకెది సాటి
వాలు కనుల దానా...
వాలు కనుల దానా నీ విలువ చెప్పు మైనా నా ప్రాణమిచ్చుకొనా
నీ రూపు చూసి శిలను ఐతినే... ఓక మాట రాక మూగబోతినే
ఓక మాట రాక మూగబోతినే
ఓక మాట రాక మూగబోతినే

Авторы: A R Rahman, Siva Ganesh

Внимание! Не стесняйтесь оставлять отзывы.