Lyrics Andamaa Nee - From "Allari Primikudu" - S. P. Balasubrahmanyam , K. S. Chithra
అందమా... నీ పేరేమిటి అందమా...
అందమా... నీ పేరేమిటి అందమా...
ఒంపుల హంపి శిల్పమా
బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
పరువమా... నీ ఊరేమిటి పరువమా...
పరువమా... నీ ఊరేమిటి పరువమా...
కృష్ణుని మధురా నగరమా
కృష్ణా సాగర కెరటమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ఏ రవీంద్రుని భావమో గీతాంజలి కళ వివరించే
ఎండ తాకని పండు వెన్నెల గగనమొలికే నా కన్నుల
ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే
మూగబోయిన రాగమాలిక ముసిరెనిపుడు నా గొంతున
సంగీతమా... నీ నింగిలో...
విరిసిన స్వరములే ఏడుగా
వినబడు హరివిల్లెక్కడ
తెలుపుమా తెలుపుమా తెలుపుమా
అందమా... నీ పేరేమిటి అందమా...
తెలుపుమా... నీ ఊరేమిటి పరువమా...
భావకవితల బరువులో ఆ కృష్ణశాస్త్రిలా కవినైతే
హాయి రెమ్మల కోయిలమ్మకు విరుల ఋతువు వికసించదా
తుమ్మెదడగని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే
మాయ జగతికి ఏ ఖయామో మధుర కవిత వినిపించడా
ఓ కావ్యమా... నీ తోటలో...
నవరస పోషనే గాలిగా
నవ్వినా పూలే మాలగా
పూజకే సాధ్యమా తెలుపుమా
అందమా... నీ పేరేమిటి అందమా...
అందమా... నీ పేరేమిటి అందమా...
ఒంపుల హంపి శిల్పమా
బాపు గీసిన చిత్రమా
తెలుపుమా తెలుపుమా తెలుపుమా...

Attention! Feel free to leave feedback.