S. P. Balasubrahmanyam - Yethimesi Thodina (From "Praanam Khareedu") Lyrics

Lyrics Yethimesi Thodina (From "Praanam Khareedu") - S. P. Balasubrahmanyam




యాతమేసి తోడినా ఏరు ఎండదూ...
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ...
యాతమేసి తోడినా ఏరు ఎండదూ...
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ...
దేవుడి గుడిలోదైనా పూరి గుడిశ లోదైనా
గాలి ఇసిరి కొడితే...
దీపముండదు దీపముండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదూ...
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ...
పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా...
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయె రా...
పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా...
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయె రా...
కుడితి నీళ్ళు పోసినా... అది పాలు కుడుపుతాదీ...
కడుపు కోత కోసినా... అది మనిషి కే జన్మ ఇత్తాదీ...
బొడ్డు పేగు తెగిపడ్డా రోజు తలుసుకో...
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో...
యాతమేసి తోడినా ఏరు ఎండదూ...
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ...
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే...
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే...
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే...
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే...
మేడ మిద్దెలో ఉన్నా... సెట్టునీడ తొంగున్నా...
నిదర ముదర పడినాకా...
పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే...
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంట రా.
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంట రా...
యాతమేసి తోడినా ఏరు ఎండదూ...
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ...
సాహిత్యం: జాలాది
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం.



Writer(s): JALLADHI, SHIBU CHAKRAVARTHI


Attention! Feel free to leave feedback.