S. P. Balasubrahmanyam - Yevvaro Yevvaro - Original Lyrics

Lyrics Yevvaro Yevvaro - Original - S. P. Balasubrahmanyam



చిత్రం: మల్లెపువ్వు (1978)
సంగీతం: చక్రవర్తి
నేపధ్య గానం: బాలు
ఎవ్వరో ఎవ్వరో...
ఎవ్వరో ఎవ్వరో నేరాలడిగేవారెవ్వరో
పాపం కడిగే దిక్కెవ్వరో
ఎవ్వరో వారెవ్వరో...
అందెలు సందడి చేసిన జాతరలో. ఆకలేసి ఏడ్చిన పసికందులు
అందం అంగడికెక్కిన సందులలో. అంగలార్చి ఆడిన రాబందులు
ఎందుకో చిందులు... ఎవరికో విందులు
ఏమిటో ఏమిటో ధర్మం ఇది న్యాయం అంటుందో
కర్మం గాయం చేసిందో? ఏమిటో. ధర్మం ఏమిటో?
శీలానికి శిలువలు. కామానికి కొలువులు
కన్నీటి కలువలు. చెలువలు
కదులుతున్న శవాలు. రగులుతున్న శ్మశానాలు
మదమెక్కిన మతితప్పిన. నరజాతికి నందనాలు
ఎప్పుడో ఎప్పుడో జాతికి మోక్షం ఇంకెప్పుడో
గాధలు ముగిసేదింకెన్నడో?
ఎన్నడో? మోక్షం ఇంకెప్పుడో?
అత్తరు చల్లిన నెత్తురు జలతారులలో
మైల పడిన మల్లెలు నవ్వులు
కుక్కలు చింపిన విస్తరి తీరులలో
ముక్కలైన బ్రతుకులు పూవులు
ఎందరికో కౌగిళ్ళు. ఎన్నాళ్ళో కన్నీళ్ళు
ఎక్కడా ఎక్కడా వేదం ఇది ఘోరం అన్నదో
వాదం ఇది నేరం అన్నదో?
ఎక్కడో? వేదం ఎక్కడో?
మల్లెల దుకాణాలు. గానాబజానాలు
వెదజల్లిన కాగితాలు. వెలకట్టిన జీవితాలు.
వల్లకాటి వసంతాలు. చస్తున్నా స్వాగతాలు
కట్లు తెగిన దాహాలకు. తూట్లు పడిన దేహాలు
ఎక్కడో? ఎక్కడో? రాధల బృందావనమెక్కడో?
బాధకు వేణుగానం ఎన్నడో?
ఎన్నడో? ఎక్కడో? ఎప్పుడో?



Writer(s): SHIBU CHAKRAVARTHI, VETURI SUNDARA RAMAMURTHY


S. P. Balasubrahmanyam - Malle Poovu
Album Malle Poovu
date of release
01-12-1977




Attention! Feel free to leave feedback.