A.R. Rahman feat. A. R. Reihana, Tipu & Nikhita Gandhi - Morethukochindhi paroles de chanson

paroles de chanson Morethukochindhi - Tipu , Nikhita Gandhi

మోరెత్తుకొచ్చింది, బూరెత్తి ఊదింది, ఊరంతా మోగింది దివిట్టం
గోరెట్టి గిచ్చింది, గోలెంతో పెంచింది, లోలోన మా మంచి ముహూర్తం

ఇంకెన్నాళ్ళపాటు దాస్తావుగాని అగ్గంటి గుట్టుని
నే జాగ్రత్త చేస్తాగా నా చేతికిచ్చేసి చల్లారిపో రమణి
నన్నల్లుకుంటే గాని వల్లకాదు అంది నీ ఇబ్బంది!
అంటుకో మక్కువగా వచ్చి, ఆదుకో అక్కున లాలించి,
అందుకే లేత సోకులన్ని ఆకువక్క చేసి తాంబూలం అందించనీ!
కళ్ళతో ఒళ్ళంతా నమిలి, చూపు ఎర్రబారిందే నెమలి,
ఒంపులన్ని గాలిస్తూ ఎటు వెళ్ళిందంటే నేనేం చెప్పేది?
కళ్యాణీ... బాగుందే నీ కొంటె బాణీ...
మోరెత్తుకొచ్చింది, బూరెత్తి ఊదింది, ఊరంతా మోగింది దివిట్టం
గోరెట్టి గిచ్చింది, గోలెంతో పెంచింది, లోలోన మా మంచి ముహూర్తం
మోరెత్తుకొచ్చింది, బూరెత్తి ఊదింది, ఊరంతా మోగింది దివిట్టం
గోరెట్టి గిచ్చింది, గోలెంతో పెంచింది, లోలోన మా మంచి ముహూర్తం
నెగ్గలేని యుద్ధం ఇదని వద్దనుకోవుగదా
ఆశపడ్డ అలసటలో గెలుపు ఉంది కదా!
సరేలెమ్మని, ఇలా రమ్మని, ఏదో కమ్మని తిమ్మిరి చూడే అమ్మాడి!
ఏవెట్టుకొచ్చింది ఏవట్టుకొచ్చింది చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలెట్టుకొచ్చింది ఏంటింక నీకున్న సందేహం!
నా కోరిక్కి కారెక్కి నీ వెంట పడ్డాది ఎట్టాగే దాన్నాపుట?
నిను ఆరారా కోరుక్కు తినందే తిక్క తీరనే తీరదట!
నీ గాలొచ్చి నా చెవి లోలాకుతో చెప్పే మాట
కొప్పులో బుట్టెడు పూలెట్టి, తప్పుకోలేనట్టు ఆకట్టి,
చెప్పుకో వీల్లేని అక్కర పెంచావే పెట్టా _ ఏం చెయ్యనే అకటా!
పక్కనే ఉన్నదే సుకుమారం, పట్టుకోమన్నదే మగమారం,
తట్టుకోమనక ఇట్టే చప్పున చిక్కి తప్పించు దూరం
కళ్యాణీ... బాగుందే నీ కొంటె బాణీ...
ఏవెట్టుకొచ్చింది ఏవట్టుకొచ్చింది చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలెట్టుకొచ్చింది ఏంటింక నీకున్న సందేహం!
(కళ్యాణీ... బాగుందే నీ కొంటె బాణీ...)ఏవెట్టుకొచ్చింది ఏవట్టుకొచ్చింది చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలెట్టుకొచ్చింది ఏంటింక నీకున్న సందేహం!
(కళ్యాణీ... బాగుందే నీ కొంటె బాణీ...)ఏవెట్టుకొచ్చింది ఏవట్టుకొచ్చింది చిన్నారి అందాల సందోహం
పూలెట్టుకొచ్చింది పాలెట్టుకొచ్చింది ఏంటింక నీకున్న సందేహం!
కళ్యాణీ... బాగుందే నీ కొంటె బాణీ...
కళ్యాణీ... బాగుందే నీ కొంటె బాణీ...

Writer(s): A R RAHMAN, SIRIVENNELA SEETHA RAMA SHASTR Y

Attention! N'hésitez pas à laisser des commentaires.