A. R. Rahman feat. Nakul Abhyankar - Neeli Kanumallo paroles de chanson

paroles de chanson Neeli Kanumallo - A. R. Rahman feat. Nakul Abhyankar



నీలి కనుమల్లో నీటి అలలే పడవలుగా
తేలి వెళుతున్న పూల ఘుమఘుమలు గాలి గుసగుసలు తెలిపే కథలవుదాం...
కొంటె కిల కిలలు కొత్త కువ కువలు పరులేవరు వినరందాం
ఇద్దరి ఏకాంతం మన ఒక జతకే సొంతం
చెట్టు కొమ్మల్లో గువ్వ జంట మనం
గుండె సవ్వడిలో విన్నమో పైకనం
కిచ కీచన్నది వచ్చి పొమ్మనది ముచటేదో మరి పిట్ట భాష అది
కిచ కీచన్నది వచ్చి పొమ్మనది ముచటేదో మరి పిట్ట భాష అది
ఒక చిరు చినుకు ఇలకు జారి ఇలా అలకిడిలో.చేరే కబురేదో
కిచ కీచన్నది వచ్చి పొమ్మనది ముచటేదో మరి పిట్ట భాష అది
ఎన్నెన్ని కలలు కనుపాపల లోగిలిలో వాలినవో
కలలసలే లోకంలో ఇన్నాళ్లూ కొలువుండేవో అడగాలో మానాలో...
నీలి కనుమల్లో...
జతలోన జగతిని మరిచి గడిపే మనని చూసి
ఆకాశమే పిలిచింది మేఘాలు పరిచింది
కిచ కీచన్నది వచ్చి పొమ్మనది ముచటేదో మరి పిట్ట భాష అది.
కిచ కీచన్నది వచ్చి పొమ్మనది ముచటేదో మరి పిట్ట భాష అది.
అలలుగా ఎగసిన తలపుల వేగం
ఇలవిడి ఎగిరిన చిలకల మైకం
మిలమిల మెరిసిన తొలకరి మేఘం
జలజల కురిసిన చినుకుల రాగం
అప్పుడలా గగన మెందుకు ఉరిమిందో
ఎందుకలా శరమై సమయం తరిమిందో
గుర్తెలేదు కదా ఎపుడు నాలో చేరావో
చెప్పలేను ఇలా నువ్వు నా చెయ్యి జారవో
గుండె తడుముకు చూస్తే వొట్టి శూన్యమె ఉందే
చిట్టి చిలకమ్మ నువ్వెపుడు ఎలా వెళ్లి పోయావే నన్నొదిలి...
ఇంకా ఎన్నాల వరకు ఒంటి రెక్కై ఎగారాలి ఎగరాలీ...
అంతా క్షణంలో కథలా ముగిసిందా
నీతో ప్రతి నిమిషం పగటి కల అయ్యిందా.
మౌనం మనసులో ఎంత అలజడి చేస్తుందో
మన జ్ఞాపకాల సంకెళ్ళ నుండి విడుదలనే అడగనని
అంతా క్షణంలో కథలా ముగిసిందా
నీతో ప్రతి నిమిషం పగటి కల అయ్యిందా.
మౌనం మనసులో ఎంత అలజడి చేస్తుందో
మన జ్ఞాపకాల సంకెళ్ళ నుండి విడుదలనే అడగనని...



Writer(s): CHEMBOLU SEETHARAMA SASTRY, AR RAHMAN


A. R. Rahman feat. Nakul Abhyankar - Nawab (Original Motion Picture Soundtrack)
Album Nawab (Original Motion Picture Soundtrack)
date de sortie
28-09-2018




Attention! N'hésitez pas à laisser des commentaires.