A. R. Rahman feat. Sunitha Sarathy, Nakul Abhyankar & Sathya Prakash - Segalu Chimmuthondhi текст песни

Текст песни Segalu Chimmuthondhi - A. R. Rahman feat. Sunitha Sarathy, Nakul Abhyankar & Sathya Prakash




హే సెగలు చిమ్ముతోంది
పగను నమ్ముకుంది హే
మనసు భగ్గుమంది
బతుకు బుగ్గయింది
కారు చిచ్చు దారి దీపమై
కాటి వైపు నిత్య పయనమై
తెలివి తగలడింది
తప్పదంటూ తప్పులెన్నో చేసి
తప్పుకునే దారులన్నీ మూసి
తప్పదంటూ తప్పులెన్నో చేసి
తప్పుకునే దారులన్నీ మూసి
మనసు జ్వలిస్తోంది
(चल चल चल चल चल)
(चल चल चल चल चल)
సెగలు చిమ్ముతోంది
(चल चल चल चल चल)
అది తప్పు ఇది ఒప్పు
అనుకున్నది నువ్వు అన్నదీ నువ్వే కాదా
నువ్వు కాదా మనిషి అంటే నువ్వే కాదా
వేరే మారావా
మనిషికి నేడు దూరమయ్యావ
(चल चल चल चल चल)
(चल चल चल चल चल)
ద్వేషం అన్నది
తీయని విషమది
ఎన్నడూ వదలని
మైకమది
హింసంటే ఆనందం
బలమంటే ఉన్మాదం
కత్తులపై నడకంటే తోమ్ తోమ్ తోమ్
ఉప్పెనయే కోపం
మృత్యువుకేం లాభం
నెత్తురుతో గాలంతా ఘుమ్ ఘుమ్ ఘుమ్
విషాద స్వరాల విలాప గీతం
సమూహ సమరపు సంగీతమందాం
పిశాచ గానాల కరాళ నాట్యం
వినాశ కాలపు విలాసమందాం
తలాంగు తకధిమి తాళం వేద్దాం
తరాల తరబడి ఇలాగే చేద్దాం
తక ధిమి తక దిద్దితోమ్
చేద్దాం చేద్దాం చేద్దాం
హే
సెగలు చిమ్ముతోంది
పగను నమ్ముకుంది హే
మనసు భగ్గుమంది
కారు చిచ్చు దారి దీపమై
కాటి వైపు నిత్య పయనమై
తెలివి తగలడింది
తప్పదంటూ తప్పులెన్నో చేసి
తప్పుకునే దారులన్నీ మూసి
సెగలు చిమ్ముతోంది
(चल चल चल चल चल)
(चल चल चल चल चल)
అది తప్పు ఇది ఒప్పు
అనుకున్నది నువ్వు అన్నదీ నువ్వే కాదా
నువ్వు కాదా మనిషి అంటే నువ్వే కాదా
వేరే మారావా
మనిషికి నేడు దూరమయ్యావ
(चल चल चल चल चल)
(चल चल चल चल चल)
(चल चल चल चल चल)



Авторы: CHEMBOLU SEETHARAMA SASTRY, AR RAHMAN



Внимание! Не стесняйтесь оставлять отзывы.