Текст песни Mounamgane - From "Naa Autograph" - K. S. Chithra
మౌనంగానే ఎదగమనీ... మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ... అర్థమందులో ఉంది.
మౌనంగానే ఎదగమనీ... మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ... అర్థమందులో ఉంది.
అపజయాలు కలిగిన చోటే... గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
మౌనంగానే ఎదగమనీ... మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ... అర్థమందులో ఉంది...
అపజయాలు కలిగిన చోటే... గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది...
ఆ .ఆ.ఆ... ఆఆఆ... ఆఆఆ.
దూరమెంతొ ఉందనీ... దిగులు పడకు నేస్తమా...
దరికి చేర్చు దారులు కూడా... ఉన్నాయిగా...
భారమెంతొ ఉందనీ... భాదపడకు నేస్తమా...
భాదవెంట నవ్వుల పంటా... ఉంటుందిగా...
సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ...
కష్టాల వారధి దాటిన వారికి సొంతమౌతుందీ...
తెలుసుకుంటె సత్యమిది తలచుకుంటె సాధ్యమిది.
మౌనంగానే ఎదగమనీ... మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ... అర్థమందులో ఉంది...
చెమట నీరు చిందగా... నుదిటి రాత మార్చుకో...
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో...
పిడికిలే బిగించగా... చేతి గీత మార్చుకో...
మారిపోని కథలే లేవని గమనించుకో...
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలె తలదించగా...
నీ అడుగుల్లొ గుడి కట్టి స్వర్గాలె తరియించగా...
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి
మౌనంగానే ఎదగమనీ... మొక్క నీకు చెబుతుంది
ఎదిగిన కొద్ది ఒదగమనీ... అర్థమందులో ఉంది.
అపజయాలు కలిగిన చోటే... గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
Внимание! Не стесняйтесь оставлять отзывы.