M.M.Keeravaani feat. Sunitha - Nenunnanani - From "Nenunnanu" текст песни

Текст песни Nenunnanani - From "Nenunnanu" - Sunitha , M.M. Keeravani




చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని...
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానీ నీకేంకాదని..., నిన్నిటిరాతని మార్చేస్తాననీ
తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలని
తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ
కాల్చేనిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ
గుండెతో ధైర్యం చెప్పెను...,
చూపుతో మార్గం చెప్పెను...,
అడుగుతో గమ్యం చెప్పెను... నేనున్నాననీ
నేనున్నాననీ నీకేంకాదనీ..., నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీ
అందరు ఉన్నా ఆప్తుడనువ్వై చేరువయ్యావనీ
జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావనీ
శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నాననీ...
నేనున్నానీ నీకేంకాదనీ, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీని నీకేంకాదనీ నిన్నటిరాతనీని మార్చేస్తాననీ



Авторы: M.M. KEERAVANI, CHANDRABOSE


Внимание! Не стесняйтесь оставлять отзывы.