S. P. Balasubrahmanyam - Manasu Oka Mandaram-Male (From "Prema Tarangalu") текст песни

Текст песни Manasu Oka Mandaram-Male (From "Prema Tarangalu") - S. P. Balasubrahmanyam




మ్మ్.హు.ఆ. ఆ. ఆ.
లా.లాలాలా.
మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం
మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం
తోటలో. తేటిదో
తొలిపాటగా వినిపించెను
ఎద కదిలించెను
తోటలో. తేటిదో
తొలిపాటగా వినిపించెను
ఎద కదిలించెను
పాటనే నీ కోసమే
నే పాడినా వినిపించునా నేస్తమా...
వికసింతువా వసంతమా...
మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం
చీకటి. నా లోకము
నీ రాకతో మారాలిరా
కథ మారాలిరా
చీకటి. నా లోకము
నీ రాకతో మారాలిరా
కథ మారాలిరా
మార్పులో నా తూర్పువై
మాపు నే వెలిగింతువా నేస్తమా.
వికసింతువా వసంతమా...
మనసు ఒక మందారం
చెలిమి తన మకరందం
మధురిమకు పులకించే
బ్రతుకు ఒక మధుమాసం
ఆహా.హా. ఆ. ఆ. ఉమ్మ్.ఉమ్మ్
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: బాలు



Авторы: SHIBU CHAKRAVARTHI, VETURI SUNDARA RAMAMURTHY


Внимание! Не стесняйтесь оставлять отзывы.