S. P. Balasubrahmanyam - Uppongele Godavari Lyrics

Lyrics Uppongele Godavari - S. P. Balasubrahmanyam




Singer: s.p. balasubramanyam
Lyrics: Veturi
Movie: Godavari
ఉప్పొంగెలే గోదావరి
ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి
మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి
వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి
రామ చరితకే పూదారి
వేసెయ్ చాప దోసేయ్ నావ
బార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా
బ్రతుకు తెరువు ఎదురీదేగా
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి భేరం
ఇల్లే ఓడలైపోతున్నఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ
నది ఊరేగింపురా పడవ మీద రాగా
ప్రభువు తానూ కాగా
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా





Attention! Feel free to leave feedback.