S. P. Balasubrahmanyam - Ve Vela Gopemmala Lyrics

Lyrics Ve Vela Gopemmala - S. P. Balasubrahmanyam

వే వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
అహహ వే వేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడె
మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడె
కన్న తోడు లేని వాడే కన్నె తోడు వున్నవాడె
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనే
మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనే
చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే
పోతన్న కైతలన్నీ పోతపోసుకున్నాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
రాస లీలలాడినాడే రాయబారమేగినాడే
గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే
నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
వరదయ్య గానాల వరదలై పొంగాడే
మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
అహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే

S. P. Balasubrahmanyam - Compilation

Attention! Feel free to leave feedback.