S. P. Balasubrahmanyam - Goruvanka Vaalagane Lyrics

Lyrics Goruvanka Vaalagane - S. P. Balasubrahmanyam



గోరువంక వాలగానె గోపురానికి
స్వరాల గణగణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
బాలక్రిష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే
వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె
అందమైన బాలుడే తనవాడై...
గోరువంక వాలగానె గోపురానికి
స్వరాల గణగణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
ఏటి మనుగడ కోటి అలలుగ
పొంగు వరదల వేగాన
పడి లేచి వలలకు తీపి కలలకు
లేని అలసట నీకేల
నల్ల నల్ల నీళ్ళల్లోన ఎల్ల కిల్ల పడ్డట్టున్నా
అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటే జాబిల్లమ్మ అబ్బాయంటే సూరీడమ్మ
ఇంటి దీపాలవ్వలంట దిక్కుల్లో
ఎవరికీ వారే... యమునకు నీరే...
రేవు నీరు నావదంట
నావ తోడు రేవుదంట పంచుకుంటే...
గోరువంక వాలగానె గోపురానికి
స్వరాల గణగణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
ప్రేమ ఋతువులు పూలు తొడిగిన
తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన
బాల సొగసుల బాటల్లో
ముగ్గందాల ఊరు నవ్వే సిగ్గందాల పిల్ల నవ్వే
బాలయ్యొచ్చి కోలాటాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే
గోపెమ్మొచ్చి గొబ్బిళ్ళాడే పొద్దుల్లో
పరవశమేదో... పరిమళమాయే...
పువ్వు నవ్వే దివ్వె నవ్వే
జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే...
గోరువంక వాలగానె గోపురానికి
స్వరాల గణగణా గంటలే మోగనేలా
గోపబాలుడొచ్చినాక గోకులానికి
పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
బాలక్రిష్ణుడొచ్చినప్పుడే
వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసుణ్ణి చూసినప్పుడే
వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె
అందమైన బాలుడే తనవాడై...




S. P. Balasubrahmanyam - Compilation




Attention! Feel free to leave feedback.