A.R. Rahman, Swarnalatha & Veturi - Kalalai Poyenu текст песни

Текст песни Kalalai Poyenu - A.R. Rahman, Swarnalatha & Veturi

ప్రేమలే నేరమా ప్రియా ప్రియా
వలపు విరహమా నా ప్రియా
మనసు మమత ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో
కలలైపోయెను నా ప్రేమలు, అలలై పొంగెను నా కన్నులు
కలలైపోయెను నా ప్రేమలు, అలలై పొంగెను నా కన్నులు
మదికే అతిధిగా రానేలనో, సెలవైనా అడగక పోనేలనో
ఎదురు చూపుకు నిదరేది, ఊగెను ఉసురే కన్నీరై
మనసు అడిగిన మనిషెక్కడో, నా పిలుపే అందని దూరాలలో
కలలై పోయెను నా ప్రేమలు, అలలై పొంగెను నా కన్నులు
అనురాగానికి స్వరమేది, సాగర ఘోషకు పెదవేది
అనురాగానికి స్వరమేది, సాగర ఘోషకు పెదవేది
ఎవరికి వారే ఎదురుపడి, వ్యధలు రగులు ఎడబాటులలో
చివరికి దారే మెలికపడి, నిను చేరగ నేనే శిలనైతిని
ఎండమావిలో నావనులే, నిట్టుర్పే నా తెరచాపలే
కలలైపోయెను నా ప్రేమలు, అలలై పొంగెను నా కన్నులు
వెన్నెల మండిన వేదనలో, కలువ పువ్వులా కలతపడి
వెన్నెల మండిన వేదనలో, కలువ పువ్వులా కలతపడి
చేసిన బాసలు కలలైపోతే, బతుకే మాయగ మిగులునని
నీకై వెతికా కౌగిలినై, నీడగ మారిన వలపులతో
అలిసి ఉన్నాను ఆశలతో, నను ఓదార్చే నీ పిలుపెన్నడో
కలలైపోయెను నా ప్రేమలు, అలలై పొంగెను నా కన్నులు
కలలైపోయెను నా ప్రేమలు, అలలై పొంగెను నా కన్నులు

Авторы: A R RAHMAN, VETURI SUNDARA RAMAMURTHY

A.R. Rahman, Swarnalatha & Veturi - Sakhi
Альбом Sakhi
дата релиза
09-03-2000

Внимание! Не стесняйтесь оставлять отзывы.