S. P. Balasubrahmanyam - Baba Sai Baba Lyrics

Lyrics Baba Sai Baba - S. P. Balasubrahmanyam




బాబా సాయి బాబా
బాబా సాయి బాబా
నీవూ మావలె మనిషివని
నీకూ మరణం ఉన్నదని
అంటే ఎలా నమ్మేది
అనుకుని ఎలా బ్రతికేది
బాబా సాయి బాబా
బాబా సాయి బాబా
నువ్వే మరణించావంటే దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే మరణించావంటే దేవుడెలా బ్రతికుంటాడు
నువ్వే దేవుడివైతే మృత్యువెలా శాసిస్తాడు
తిరుగాడే కోవెల నీ దేహం శిధిలంగా అవుతుందా
పిలిచినంతనే పలికే దైవం మూగైపోతాడా
బాబా సాయి బాబా
బాబా సాయి బాబా
నీవూ మావలె మనిషివని
నీకూ మరణం ఉన్నదని
అంటే ఎలా నమ్మేది
అనుకుని ఎలా బ్రతికేది
బాబా సాయి బాబా
బాబా సాయి బాబా
దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోన ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా
దివిలో ఉన్నా భువిలో ఉండే మాకై నింగిని చీల్చుకురా
దిక్కులలోన ఎక్కడ ఉన్నా ముక్కలు చెక్కలు చేసుకురా
సూర్యచంద్రులను చుక్కల గుంపును కూల్చి రాల్చి రావయ్యా
గ్రహములు గోళాలిహపర శక్తులు గగ్గోలెత్తగ రావయ్యా
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు లోకం
నువు లేకుంటే నువు రాకుంటే ఎందుకు మాకు లోకం
లయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోనీ
ముల్లోకాలు కల్లోలంలో శూన్యం అయిపోనీ
రగిలే కాలాగ్ని ఎగిసే బడబాగ్ని
దైవం ధర్మాన్ని దగ్ధం చేసేయనీ
నేనే ఆత్మైతే నీవే పరమాత్మా
నీలో నన్ను ఐక్యం అయిపొనీ... పోనీ



Writer(s): Ilayaraja


Attention! Feel free to leave feedback.